మనసులో మాట

Tuesday, September 22, 2009

గీతా మాధురి

చౌదరి గుర్తున్నాడా? వాడు నేను ఆ రెండేళ్లూ కలిసి ఉన్నాం, మురళీ, నాగ దూరంగా ఉన్నా తరచూ కలిసే వాళ్ళు. లక్ష్మి సిటీలోనే కాబట్టి మా మీటింగులకు అంతరాయం కలగలేదు. ఆ తరువాత పొట్టకూటి కోసం తలాఓదారిన వెళ్లాం. నువ్వు?
నేనవరినీ మళ్ళీ కలవలేదు. ఇదిగో నిన్నే చూస్తున్నా ఇన్నేళ్ల తరువాత.
ఎలాగైనా మనమంతా కలిసి ఉన్న ఆ నాలుగేళ్ల టైం ఎంత గొప్పది. తరువాత రెండేళ్లూ నువ్వు లేవు మిగతా వాళ్లూ ఎవరికి వాళ్ళు.
రెండు కాఫీ వెయిటర్ తో చెప్పాను. నో నాకొద్దు. నువ్వు తెప్పించుకో అంది. అప్పట్లో అందరం క్యాంటిన్‍లో బఝ్ఝీలు సమోసాలు లాగిస్తే తను బాక్స్ నుండి క్యారెట్‍ కొబ్బరి దోసకాయముక్కలు బయటకు తీసేది. ఎవరికీ మెసేజ్‍లు ఇవ్వదు, తను ఎవరి ఇంఫ్లూయెన్స్ లొ పడదు. ఆమె గురించి ఏమీ అడగలేకపోతున్నా. ఆమె అప్పుడూ అంతే తన ఫామిలీ, పర్సనల్ ఏమీ ఎవరికీ తెలియదు. పెళ్లికి ఆహ్వానించలేదు.

ఆ తరువాత అలాంటి స్నేహితులు లేరు. కాలేజి లో ఉన్నంత వరకే స్నేహాలు, అభిమానాలు. బయట ప్రపంచంలో అవి లేవు. ఇన్నేళ్లలో పెద్దగా చెప్పుకోదగ్గ స్నేహితులు కాలేదు. ఉధ్యోగరీత్యా అవసరాలు పంచుకోవడం.
అప్పటి సరదా స్వచ్చత మళ్లీ రావు. నిజం అన్నట్టు తల ఊగించింది. ఆమె చెవులకు ఉన్న హాంగింగ్స్ తమాషాగా ఊగాయి. పొడవైన నల్లటి జుట్టు, మెరిసిపోతున్న పసిమి చాయ శరీరం , ఆకు పచ్చ రంగు డ్రెస్సు అద్భుతంగా మ్యాచ్ అయ్యాయి.
ఇంకావుంది...

Monday, September 21, 2009

గీతా మాధురి

గీతా మాధురి



కారు లోంచి దిగి నా వైపు కదిలింది. ఆలీవ్‍గ్రీన్ కలర్ చుడిదార్ వదులుగా వదిలేసిన కురులు, కళ్ళకు గాగుల్స్. ఆ హైటు, నడక చూడగానే ఇట్టె పోల్చుకున్నాను. పదిహేను ఏళ్ళు కాదు ఇంకో ఇరవై ఏళ్ళ తరువాత చూసినా ఆమెని పోల్చడానికి నేను ఏమీ ఇబ్బంది పడను.
అప్రయత్నంగా నా కాళ్ళు ఆమెకేసి అడుగులు వేశాయి. నా ఆత్రం పసిగట్టినట్టుగా నా వైపు వచ్చి హాయ్ అంది, అదే నవ్వు టూత్ పేస్ట్ అడ్వర్ట్వైజ్‍మెంటు కి మాడల్సు నవ్వే నవ్వు. ఆ నవ్వుకే అప్పుడు కాలేజ్‍లో అందరూ దాసోహమని ఆమెచుట్టూ చక్కర్లు కొట్టెవారు.
లోపలవెళ్ళి కూర్చున్నాం. నువ్వేం మారలేదు నా జుట్టుని తడుముకుంటూ చెప్పాను. నువ్వు మాత్రం చాలా చేంఝ్ అయ్యావు, ముందునుంచీ నువ్వు మేధావివి అందుకే బట్టతల మొదలైంది. నవ్వుతుంది.
ఎలా వున్నావు? ఏం చేస్తున్నావ్?
ఇదిగో చూస్తున్నావు ఇలా వున్నా, ఏం చేస్తున్నావు అంటే? ఏం చేయాలి? హ హ హ మా ఆయన సంపాదించింది ఖర్చు పెడుతున్నా. హ హ హ. అప్పటిలాగే మాటకి ముందూ వెనక నవ్వు.
నాగురించి ఏది చెప్పినా ఏదో ఒక కామెంట్ విసురుతూ నవ్వుతుంది. ఇంత సన్నిహితంగా మాట్లాడుతుందని అనుకోలేదు. ఈ వూరికి వచ్చాను నిన్ను కలవాలని చెపితే నిన్న సాయంత్రం ఆమె సమాధానం విన్న తరువాత ఆమె ఇలా మాట్లాడుతుందని వూహించలేదు. ఇప్పుడే రంగులు కలుపుకున్నాను రాలేను రేపు కలుద్దాం.
దాదాపు పదిహేనేళ్ళ తరువాత కలిసి మాట్లాడిన ఒకప్పటి నేస్తం తో అలాంటి మాటలు ఆమె తప్పించి ఎవరు మాట్లాడగలరు! ఆమెకి ఇప్పుడైనా అప్పుడైనా తన పనే ముఖ్యం. తను వేసే బొమ్మ పాటి విలువ లేదా మా స్నేహానికి అనిపించి మనసు చివుక్కుమంది. ఆమె అంతే.
నువ్వెం మారలెదు అలాగే మాట్లాడుతున్నవ్ నాన్ స్టాప్‍గా
హ హ హ అవును ఇప్పుడు నా కాలక్షేపం మాటలు చెప్పడం! హ హ హ . నేను రేడియో జాకీ హ హ హ. అదో టైం పాస్.
మన బ్యాచ్‍లో అందరం ఆ తరువాత ఎమ్‍టెక్ కి వెళ్ళాం. నువ్వుమాత్రమే మన ఆరుగురిలో మిస్సయ్యావు.
హ హ హ అక్కడ మిస్సు అయ్యి మా ఆయనకి మిస్సెస్సు అయ్యా హ హ హ.
అదే నవ్వు ఇప్పటికి ఏమాత్రం కల్తీ కాని! ఆమెకి మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన నవ్వు. కాలేజీ బ్యూటీ అనే అర్హతను సంపాదించి పెట్టిన నవ్వు అందమైన పలువరస. అది చూస్తూ జీవితమంతా హాయిగా గడిపేయొచ్చు అనుకునేవాడిని.
ఇంకా వుంది ....

Tuesday, August 25, 2009

కొoడపల్లి శేషగిరి రావు గారి అద్భుత చిత్రాలు మరియు జీవిత విశేషాలు






కొoడపల్లి శేషగిరి రావు గారి అద్భుత చిత్రాలు మరియు జీవిత విశేషాలు.
Film Telangana 2009′ Digital Film Contest లో Dhanraj యొక్క ఫిల్మ్ "Kondapalli SheshagiriRao"




(వీడియో బఫరింగ్ పూర్తి అవటానికి పాజ్ లో పెట్టండి)

పూర్తిగా ఇక్కడ చూడండి------ http://filmtelangana.com/?p=324

Wednesday, July 22, 2009

నా కథ

ప్రభుత్వ ఉద్యోగులందరూ అవినీతి పరులు కాదు. అలాగే వ్యాపారులు ప్రైవేటు ఉద్యోగులు అందరూ కష్టజీవులు నీతివంతులూ కాదు. ప్రైవేటు ఉద్యోగులలో అవకాశం వస్తే లంచం తీసుకోని వాళ్లు ఎంతమంది?

నేను ఆ పోస్ట్ రాసింది ఇప్పుడే కొత్తగా బీటెక్ పూర్తయి ఉన్న వారు ఇప్పటి ప్రైవేట్ ఉద్యోగాల పరిస్తితి చూసి నిరాశ చెందకుండా సత్తా ఉంటే మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయనీ గ్రహించాలనే గాని ఇంకొకందుకుకాదు.



లక్ష్యాలు వాటికోసం శ్రమ ఉంటే ఎక్కడ ఐనా మీకు కావలసింది సాధించ వచ్చు.

నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. (నాతో పాటు పనిచేసే వాళ్ళలో పైసా ముట్టకుండా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.)

జీవితానికి కావలసింది డబ్బేకాక ఇంకాచాలా ఉన్నాయి. జీవిత లక్ష్యం ఏమిటి? అది సాధించడానికి మనం ఎంత నిజాయితీతో ప్రయత్నం చేస్తున్నాం అనేదే ముఖ్యం.
ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం అంటే పదిహేను వేల జీతం తో మొదలవుతుంది నేను ప్రభుత్వ ఉద్యోగిగా మొదటి సాలరీ చాలా తక్కువ ఉండేవి.

నాకూ అప్పుడు ఒక లక్ష్యం ఉండేది. ఇప్పటి వాళ్ళలా డబ్బూ నా లక్ష్యమే కాని ఇంత డబ్బు ఈ వయసులోపల అనేది నా లక్ష్యం.
అందరికీ ఉన్నట్టే బంగ్లా - కారు -తరువాత సొంతంగా -ఒక షాపింగ్ కాప్లెక్స్ - ఒక ఫామ్ హౌస్ అదీ ముఫై అయిదేళ్ళ లోపుగానే.
తరువాత మాములుగా టైమ్ టూ టైమ్ ఉండే జాబ్ అప్పటికి నా పిల్లలకి ఊహ తెలుస్తూ నా అవసరం కావలసి వస్తుంది పూర్తిగా భార్యా పిల్లలకి నా మిగతా అభిరుచులకు నా జాబ్ కు. ఇదీ లైఫ్ నేను నిర్ణయించుకున్నాను.

ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను అప్పట్లో ఇప్పటిలా ఎక్కువ మొత్తం సాలరీలు లేవు. కాలీ టైం లో రియల్ ఎస్టేట్ మొదలు పెట్టాను. తరువాత బిల్డర్ గా నా దగ్గర ఉద్యోగులను అపాయింట్ చేసుకుని నేను అనుకున్నవన్నీ సాధించాను.

నేను ఇంటికి నా పిల్లలకు డబ్బు తప్పించి ఇంకేమీ ఇవ్వలేనంత బిజీగా ఉండేవాడిని. నేను అనుకున్నవి సమకూరాయి తరువాత అన్ని పనులూ లావాదేవీలూ కట్టిపడేసి పూర్తిగా ఇంటికి నా పాత జాబ్ కీ మాత్రమే నేను నా టైం కెటాయించాను.
కావాలనుకుంటే సంపాదనకు ఆశకు అంతెక్కడ. కాని నేను ఎంత వరకు కావాలనుకున్నానో అంతలో ఆగాను.

నా కొలిగ్స్ జీవితాలు చూస్తే మిగతావారూ అంతే తృప్తిగా ఉన్నారు. ప్రమోషన్స్ పెరిగే సాలరీలు. జీవితం అనుకున్నంత చెడ్డగా ఏమీ లేదు. సీనియర్ ఇంజనీర్ గా నెలకు నలభై వేల జీతం, పిల్లలకు కెటాయించ గలిగే సమయం. జీవితంలో ఇంతకు మించి ఆశ పడితే అది అత్యాస కాకుండా చూసుకోవలసిందే నని నా అభిప్రాయం.


రోజుకు 16 గంటలు ఉద్యోగం వ్యాపారం రెంటికీ కెటాయించాను దానికి ఫలితంగా పూర్తి ఇంటి భాద్యత నా భార్యపై పడింది. నేను అనుకున్నది సాధించాక ఆమెకి ఇంటి భాద్యతల నుండి పూర్తిగా విశ్రాంతి ఇవాలనుకున్నాను. నా అబ్బాయి పదేళ్ళ వరకు వాళ్ళ అమ్మ రక్షణలో ఉంటే ఆపై వాడి వికాసానికి పూర్తి భాద్యత నాపై వేసుకోవాలను కున్నాను.

బాబు సంతోషంగా పూర్తి మానసిక శారీరక ఆరోగ్యంతో ఇప్పుడూ పూర్తి నా పెంపకంలో ఉన్నాడు. నా భార్య తన కిష్టమైన కెరీర్లోకి మెల్లిగా ఇప్పుడే అడుగిడుతోంది. డబ్బుకోసం పనిచేయవలసిన అవసరం ఆమెకిలేదు దానివల్ల ఆమె మరింత తాపీగా ఇష్టమైన పని చేయగలుగుతోంది.

ఇదీ క్లుప్తంగా నా కథ.

Tuesday, July 21, 2009

ఉద్యోగాలు

అమ్మాయిలు, అబ్బాయిలూ

ఉద్యోగాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు.

ప్రభుత్వ ఉద్యోగాలని చులకనగా చూడకండి.

మీరు పోగొట్టుక్కున్న ప్రైవెట్ ఉద్యోగం కంటే మేలైనవి.

ఎప్పుడు తరిమేస్తారోనన్న భయం లేనివి.

అన్ని సౌకర్యాలు, భద్రత కలిపించేవి.

జీవితాన్ని ప్రశాంతంగా గడిపెందుకు అనువుగా ఉండేవి.

కావలిసినప్పుడు (పై చదువులకో, అనారోగ్యకారణంగానో) లీవు పెట్టుకున్నా మీ ఉద్యోగానికి ఢోకా ఉండదు.
ప్రైవేట్ లో మాదిరి తరిమేయకుండా గౌరవప్రదంగా పదవి విరమణ మహోత్సవం జరిపి జీవితానికి కావలసినంత డబ్బు, పెన్షన్ భద్రతతో మిమ్మల్ని ఇంటికి సాగనమ్పేవి.

ఇంకా ఎన్నెన్నో ప్లస్సులు.

ప్రయత్నించండి.

ఇది చూడండి 20,800 స్టైఫండు. http://www.govtjobs.co.in/government-jobs/recruitment-of-engineers-in-electronics-corporation-of-india-limited/

30 40 వేల జీతంతో పనిచేస్తామా అనుకోకండి సీనియారిటీతో అది పెరుగుతుంది. ప్రమోషన్స్ ఉంటాయి. రిటైర్ అయ్యేనాటికి మీ సాలరీ లక్షల్లోకి వస్తుంది. సాలరీ కాక ఇతర అలవెన్సులు ఉంటాయి. ధరలు పెరిగిన ప్రతిసారి దానికి అనువుగా డీయే పెరుగుతుంది.

ఇంకా ఎన్నో ఉద్యోగాలు

http://www.govtjobs.co.in/government-jobs/vacancies-at-bharat-sanchar-nigam-limited/

మరొక సారి ఇంకొన్ని చెపుతాను.

Saturday, June 20, 2009

నేచర్ క్యూర్

మంతెన సత్యనారాయణరాజు గారి వెబ్‍సైటు. http://www.mantenasatyanarayanaraju.com/

లాభాపేక్షలేకుండా వారు చేసే సేవలు ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఆరోగ్యవంతమైన ఆయుషు పొందండి.

Friday, June 12, 2009

ఏం జరగ బోతోంది!?








21 డిసెంబర్ 2012 ఏం జరగబోతోంది?